ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విష్ణు మంచు 'జిన్నా' మూవీలోని పార్టీ సాంగ్ కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 02:15 PM

ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఈ చిత్రానికి 'జిన్నా' అనే టైటిల్‌ను లాక్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఒక పార్టీ పాటను కంపోజ్ చేయడానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్,గణేష్ ఆచార్యను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్‌ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com