ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న "రామారావు ఆన్ డ్యూటీ"

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 04:32 PM

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. శరత్ మండవ టేకింగ్ లో లోపాలు దీంతో పలు సీన్లను రీషూట్ చెయ్యడమే ఈ సినిమా ఆలస్యానికి కారణమని సోషల్ మీడియాలో నిన్నటి వరకు ప్రచారం జరిగింది.
తాజాగా ఈ రోజు రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa