విక్రమ్ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. జూన్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు 400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, కోలీవుడ్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో లోకేష్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను తలపతి విజయ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్టర్ లో విజయ్ ను లెక్చరర్ లా చూపించిన లోకేష్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ లా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీ ముంబై నేపథ్యంలో జరుగుతుందట. పాన్ ఇండియా సినిమా కావడంతో దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కామన్ కధాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.
![]() |
![]() |