ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డకు తండ్రయ్యారు. యాభై ఒక్క ఏళ్ళ నడి వయసులో మగబిడ్డకు తండ్రైన దిల్ రాజుకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న ఒక కుమార్తె హన్షిత రెడ్డి ఉంది. 2017లో కార్డియాక్ అరెస్ట్ తో హఠాత్తుగా మరణించిన తన తల్లిని మర్చిపోలేక ఒంటరిగా బాధపడుతున్న దిల్ రాజుకు హన్షిత 2020లో రెండో పెళ్లి చేసింది. నిజామాబాద్ జిల్లా నర్సింగ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. తేజస్వినితో దిల్ రాజుకు ఈ రోజు ఉదయం మగబిడ్డ జన్మించడంతో, తన సినీ కెరీర్ కు వారసుడు వచ్చినట్టైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఒకరేంజులో ట్రెండ్ అవుతుంది.