కొత్త సినిమా విడుదలవుతుందంటే చాలు ఆయా చిత్రబృందాలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి ఆ భగవంతుని ఆశీస్సులు పొంది, తమ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటారు. తాజాగా పక్కా కమర్షియల్ మూవీ టీం కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. జూలై 1వ తేదీన విడుదలవబోతున్న పక్కా కమర్షియల్ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ మూవీని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు.