బాలనటిగా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి, దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, సౌత్ టాప్ హీరోలందరితో కలిసి పని చేసిన హీరోయిన్ మీనా. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో తొంభైల కాలంలో మీనా టాప్ హీరోయిన్ గా కొనసాగింది. 2009లో విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వివాహం చేసుకున్న మీనాకు నైనికా అనే పదకొండేళ్ల కుమార్తె ఉంది.
పోతే., నిన్న సాయంత్రం తమిళనాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. గతంలో కోవిడ్ బారిన పడిన విద్యాసాగర్, ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మధ్యలో పలుమార్లు అస్వస్థతకు గురవుతూ ఉన్నారట. దీనికి తోడు ఆల్రెడీ విద్యాసాగర్ కు ఊపిరితిత్తుల సమస్య ఉండడంతో, కొన్ని రోజుల నుండి శ్వాస కూడా సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారట. నిన్న సాయంత్రం పరిస్థితి మరీ సీరియస్ గా మారడంతో హాస్పిటల్ లో జాయిన్ ఐన విద్యాసాగర్ చికిత్స తీసుకుంటూనే మరణించారు. దీంతో మీనా అభిమానులు, కోలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 45ఏళ్ళ వయసులోనే వైధవ్యం ప్రాప్తిమ్చడంతో మీనా పట్ల పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు సానుభూతి తెలియచేస్తున్నారు.
![]() |
![]() |