హైదరాబాద్‌లో చిత్ర నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత స్ట్రీమ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.ఈ కొత్త నిబంధనను ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ పాటించాలని నిర్మాతల మండలి సిఫార్సు చేసింది. దీంతో ఓటీటీలో కొత్త సినిమా చూడాలనుకునే వారు 50 రోజులు ఆగాల్సిందే.