సమంత హీరోయినిగా నటించిన సినిమా 'యశోద'.ఈ సినిమాకి హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్ట్ 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేశారు. ఇప్పుడు మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.