తెలుగు చిత్ర సీమలో గాయనీగాయకులుగా రాణిస్తున్న హేమచంద్ర, శ్రావణ భార్గవిలపై ఇటీవల రూమర్స్ చక్కర్లు కొడున్నయి. తాజాగా వాటికి చెక్ పెడుతూ ఇద్దరూ స్పందించారు. 2009లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే కొంతలంగా వీళ్లు విడివిడిగా ఉంటున్నరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నరు అని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ఈ క్రమంలో భార్యభర్తలు నెటిజన్లకు సమాధానమిచ్చారు. సెలబ్రిటీలపై పుకార్లు రావడం కామన్ కానీ వాటిని పూర్తిగా తెలుసుకోండంటూ క్లారిటీ ఇచ్చారు. "నా సోలో పాటల కంటే ఇలాంటి అనవసర, అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది" అని హేమచంద్రపోస్ట్ చేశారు. నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 30 విపరీతంగా పెరిగిపోయారు.శ్రావణ భార్గవి వెల్లడించింది.