చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ తరపున హీరో విశాల్ పోటీ చేయనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను విశాల్ ఖండించాడు. ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని, ఆ వార్త ఎలా వచ్చిందో తనకు తెలియదని అన్నారు. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు.