మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూలై 4 సాయంత్రం 5.45 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.