నటి మీనా ఇంట్లో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ బుధవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు.ఆయన మృతి పట్ల నటి మీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.భర్త మరణం తర్వాత మీనా తొలిసారి సోషల్ మీడియాలో స్పందించింది. తన భర్త విద్యాసాగర్ మృతిపై అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయవద్దని ఆమె మీడియాను కోరారు. ''భర్త దూరమయ్యారనే బాధలో నేనున్నా. దయచేసి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని తెలిపారు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందానికి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, మా స్నేహితులు మరియు మీడియాకు ధన్యవాదాలు మీనా తెలిపారు.