గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ కి ఉన్న అనుబంధం గురుంచి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై పవిత్ర లోకేష్ స్పందించారు. నరేష్ భార్య రమ్య బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై లేనిపోని అభాండాలు వేసిందని పవిత్ర లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని తెలిపారు. ఏదైనా ఉంటే హైదరాబాద్‌లో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకోవాలి అని తెలిపారు.తమకు అందరూ మద్దతుగా ఉండాలిని పవిత్ర లోకేష్ విజ్ఞప్తి చేశారు.