మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన "పక్కా కమర్షియల్" చిత్రం గత శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. బహుశా ఈ పరిస్థితి, ఈ వారంలో విడుదలవ్వబోయే "హ్యాపీ బర్త్ డే" సినిమాకు శుభసూచికం కావొచ్చు.
రితేష్ రానా డైరెక్షన్లో సర్రియల్ కామెడీ అనే కొత్త జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ లో నటించింది. రితేష్ రానా గత చిత్రం "మత్తు వదలరా" సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. దీంతో అతని డైరెక్షన్లో రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను వింత అనుభూతికి లోను చెయ్యటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.
పక్కా కమర్షియల్ మిక్స్డ్ టాక్ ఈ సినిమాకు ఒక ప్లస్ అనుకుంటే, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న ఈ మూవీ టికెట్ రేట్లు మరొక ప్లస్. హైదరాబాద్ లోని ప్రీమియం ముల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో హ్యాపీ బర్త్ డే టికెట్ ప్రైస్ కేవలం రూ. 200, సింగిల్ స్క్రీన్స్ లో ఐతే అత్యధికంగా రూ. 110...దీంతో ఈ సినిమాకు కేవలం ఏ సెంటర్ ఆడియన్స్ మాత్రమే కాక బి,సి సెంటర్ ఆడియన్స్ కూడా బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రేక్షకుడిని ధియేటర్ కు రప్పించేందుకు కావలసిన అన్ని అంశాలు హ్యాపీ బర్త్ డే సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. ఇక, వెండితెరపై ఈ సినిమా మ్యాజిక్ ను క్రియేట్ చెయ్యగలిగితే, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని చెప్పిన జోస్యం అక్షరాలా నిజమవుతుంది.