హీరోయిన్ అంజలి సడన్ సప్రైజ్ ఇచ్చింది. ఆమె ఐటమ్ భామగా మారింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటికొచ్చింది. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శక త్వంలో నితిన్ నటిస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం'. కృతి శెట్టి హీరోయిన్. క్యాథరిన్ రెండో హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఐటమ్ సాంగ్ లో అంజలీ మెరవ నుంది. ఈ సాంగ్ అప్ డేట్ ఈరోజు రానుంది. ఈ సినిమాలో కలెక్టర్ ఎన్.సిద్ధార్డ్ రెడ్డి గా నితిన్ కనిపించ బోతున్నాడు. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్, ఆదిత్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.