తెలుగు హీరోయిన్ రీతూ వర్మ వెస్ట్రన్ వేర్స్ లో అదరగొడుతోంది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ట్రెండీ వేర్స్ లో మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్ అట్రాక్ట్ చేస్తోంది.టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తన కేరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లే సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ముఖ్యంగా సినిమాల్లో తను నటించే పాత్రల పట్ల చాలా జాగ్రత్తగా ఉంది.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ చిత్రాలతో రితూ మంచి సక్సెస్ ను అందుకుంది. నాని, విజయ్ దేవరకొండ సరసన ఆడిపాడి.. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.అటు సోషల్ మీడియాలోనూ తన అభిమాలకు టచ్ లోనే ఉంటుందీ తెలుగు హీరోయిన్. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. అయితే ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనిపించే రితూ ఈసారి మాత్రం చాలా ట్రెండీ లుక్ లో కనిపించింది