టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే "ది వారియర్" గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తుండగా, నదియా ముఖ్యపాత్రలో నటించనున్నారు. జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బుల్లెట్, దడ దడ, విజిల్ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా కలర్స్ అనే మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసారు. ఈమేరకు జూలై 6వ తేదీ రాత్రి 7:21 నిమిషాలకు కలర్స్ అనే కలర్ఫుల్ సాంగ్ ను రిలీజ్ చెయ్యనున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
![]() |
![]() |