టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం "సమ్మతమే". కొత్త దర్శకుడు గోపినాధ్ రెడ్డి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 24న విడుదలై, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ అంచనాల మధ్య విడుదలైన సమ్మతమే బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఆ సినిమాను మేకర్స్ అనుకున్న సమయానికన్నా ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఆహా తెలుగు ఓటిటిలో ఇంటరెస్టింగ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. సమ్మతమే సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్రకటన త్వరలోనే రాబోతుందని ఆ పోస్ట్ చెప్పకనే చెబుతుంది. బిగ్ స్క్రీన్ పై తేలిపోయిన సమ్మతమే డిజిటల్ లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.