కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఒక చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా, దిల్ రాజు సొంత నిర్మాణ సంస్థైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మింపబడే 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పంజాబ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలలో కీలక షెడ్యూల్స్ ను జరుపుకుంది.
తాజాగా మరోసారి ఈ మూవీ షూటింగ్ పంజాబ్ లో జరుగుతుంది. అక్కడ ఒక యూనివర్సిటీలో వెయ్యిమంది డాన్సర్లతో రామ్ చరణ్ పై ఒక బిగ్ బడ్జెట్ సాంగ్ ను చిత్రీకరించారట. పోతే..., ఈ సాంగ్ షూటింగ్ నిన్నటితో ముగియడంతో నిన్న సాయంత్రమే చెర్రీ తన సొంత ఛార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ మూవీ షూటింగ్ డెబ్బై శాతం పూర్తయ్యింది. త్వరలోనే హైదరాబాద్ లో ఈ మూవీ మరో షెడ్యూల్ ను ప్రారంభించనుంది.
![]() |
![]() |