వరుణ్ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం బీస్ట్. పూజాహెగ్డే కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు. బలమైన కథ ఉన్నప్పటికీ, కథనం సరిగా లేకపోవటంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఈ సినిమాలోని హలమితి హబిబో (అరబిక్ కుతూ)పాట యూట్యూబులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. అరబిక్ కుతూ లిరికల్ వెర్షన్ యూట్యూబులో 446 మిలియన్లతో దూసుకుపోతుంటే, దానికి ధీటుగా ఇటీవల విడుదలైన అరబిక్ కుతూ ఫుల్ వీడియో సాంగ్ కూడా ఒక రేంజులో ట్రెండ్ అవుతుంది. 151 మిలియన్ల వ్యూస్ తో, 1.9 మిలియన్ల లైక్స్ తో యూట్యూబ్ లో ఒక రేంజులో ట్రెండ్ అవుతుంది. జానీ మాస్టర్ స్టెప్పులు, అనిరుధ్, జోనితా గాంధీల స్వరం ఈ పాటను సూపర్ డూపర్ హిట్ చేసాయి.