పందెంకోడి, పొగరు, అభిమన్యుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సినీ హీరో విశాల్ దగ్గరయ్యాడు. ఇటీవలే ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలో వివాహం గురించి ప్రకటిస్తానని తెలిపాడు. తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి అచ్చిరాదని పేర్కొన్నాడు. అయితే ఆమె ఎవరు అని అడగ్గా వివరాలు చెప్పకుండా దాటవేశారు. ప్రస్తుతం ఆయన గాయం మానడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందని అన్నారు.