వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "అంటే సుందరానికి" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని OTT స్ట్రీమింగ్ కి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లకు లాక్ అయ్యిన సంగతి అందరికి తెలిసందే . తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల షేర్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఈ రోమ్ కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.