'ధూత' అనే వెబ్ సిరీస్‌తో హీరో నాగ చైతన్య ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తోన్నారు. తాజాగా 'దూత' నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. దూతలో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. త్వరలోనే దూత సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.