ఇండియన్ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "పొన్నియిన్ సెల్వన్". షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 30 న విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను షురూ చేసిన మేకర్స్ వారం రోజుల నుండి సినిమాలో కీలక పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా టీజర్ ను కూడా విడుదల చెయ్యగా, అప్పటివరకు ఎలాంటి హైప్స్ లేని ఈ సినిమాకు టీజర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా టీజర్ లో ఐశ్వర్యారాయ్, త్రిషలు ఎదురుపడే సీన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో ఈ సీన్ కోసం వేకళ్ళతో ఎదురుచూస్తున్నట్టు పోస్టులు పెడుతున్నారు. రాయల్ లుక్ లో ఐశ్వర్య, త్రిష ఒకరికొకరు పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది. వీరిమధ్య ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండి ఉంటాయో అని అభిమానులు చాలా ఎక్జయిటింగ్ కు గురవుతున్నారు.
![]() |
![]() |