తాను తరచూ జ్ఞాపకశక్తిని కోల్పోతానని, ఆ విషయంలో చాలా భయానికి గురవుతున్నానని హీరోయిన్ తమన్నా పేర్కొంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో సంభాషిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలలో అవంతిక పాత్ర చాలా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'భోళాశంకర్' సినిమాలోనూ, అమెజాన్ ప్రైమ్‌కు సంబంధించి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వివరించింది.