వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రేక్షకులతో తనను వేరుగా పోల్చుకొని ఎప్పుడూ చూడలేదని, తానేమీ పై నుంచి ఊడిపడలేదని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు తన నుంచి కోరుకుంటున్న సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.