టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకుడు. షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ ను విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. కొత్తపుంతలు తొక్కుతున్న టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, మాచర్ల నియోజకవర్గం సినిమాను ప్రచారం చేసేందుకు నితిన్ బుల్లితెర సీరియల్స్ లో గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించబోతున్నాడట. ఐతే, ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.