పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్ పేరెంట్స్ ఇటీవలే అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా నటి అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్న రాహుల్.. మరో 3 నెలల్లో పెళ్లి చేసుకోనున్నాడని సమాచారం. ఈ రెండు కుటుంబాలు కలిసి ఈ ప్రేమజంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారని సమాచారం.