"విరాటపర్వం" తర్వాత సాయి పల్లవి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం "గార్గి". గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా రూపొందుతున్న గార్గి లో సాయి పల్లవి ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ మూవీకి గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించారు. తండ్రిని జైలు నుండి విడిపించేందుకు న్యాయ పోరాటం చేస్తున్న మధ్యతరగతి యువతిగా సాయి పల్లవి ఇందులో నటించనుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు "యాత్రి" అనే పాటను విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్గా ఎనౌన్స్ చేసారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో జీని మరియు మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్ బ్యానర్లపై రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ నిర్మిస్తున్నారు. తెలుగులో రానా దగ్గుబాటి, తమిళంలో సూర్య, జ్యోతిక దంపతులు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.