మెగా మేనల్లుడు, టాలీవుడ్ యువనటుడు వైష్ణవ తేజ్ నటించిన కొత్త చిత్రం "రంగరంగ వైభవంగా". తమిళ అర్జున్ రెడ్డి ని తెరకెక్కించిన గిరిశాయ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు. 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్గా ఎనౌన్స్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
కధల ఎంపికలో వైష్ణవ్ రూటే సెపరేటు. విభిన్న కధలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్న వైష్ణవ్ నుండి రాబోతున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు "రంగ రంగ వైభవంగా" సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.