యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలే "భళా తందనాన" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. తదుపరి శ్రీవిష్ణు "అల్లూరి" అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
తాజాగా శ్రీవిష్ణు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు శ్రీవిష్ణు ఒప్పుకున్నాడని టాక్. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ AK ఎంటెర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ చిత్రానికి బాణీలందించబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.