అక్కినేని నాగచైతన్య, రాశిఖన్నా జంటగా, విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం "థాంక్యూ". దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ మూవీ జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ క్రమంలో సినిమా నుండి టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
తాజాగా నిన్న సాయంత్రం థాంక్యూ ట్రైలర్ విడుదలవ్వగా, దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ అద్వైత్ చందన్ కు విపరీతంగా నచ్చేసిందట. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉందని, సినిమా చూడాలని చాలా కుతూహలంగా ఉందని, చెప్తూ, తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసాడు. ఈ సందర్భంగా చైతూ తమను (లాల్ సింగ్ చద్దా మూవీ టీం) మర్చిపోయాడంటూ పేర్కొనడం విశేషం.
చైతూ బాలీవుడ్ డిబట్ లాల్ సింగ్ చద్దా కు అద్వైత్ చందన్ డైరెక్టర్. ఇందులో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.