అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న "థాంక్యూ" మూవీ ట్రైలర్ ఎట్టకేలకు నిన్న సాయంత్రం విడుదలైంది. ప్రేక్షకాభిమానుల హృదయాలను చూరగొంటున్న ఈ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో స్థానం సంపాదించుకుని, ఇప్పటివరకు 6.4 మిలియన్ వ్యూస్ తో 138కే లైక్స్ తో దూసుకుపోతుంది.
విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న విడుదల కాబోతుంది.