కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు.
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. తాజాగా ప్రియా వారియర్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ టాప్ లో ప్రియా వారియర్ బెడ్ పై బోల్డ్ గా ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.