షార్ట్ ఫిలిమ్స్ నుండి ఒకేసారి "సాహో" వంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని డైరెక్ట్ చేసే స్థాయి వరకు ఎదిగి అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసాడు డైరెక్టర్ సుజీత్. తొలిచిత్రం "రన్ రాజా రన్" తో ప్రేక్షకులను ఫిదా చేసిన సుజీత్ రెండవ చిత్రం సాహో తో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. కానీ, ఈ చిత్రం నార్త్ లో మంచి వసూళ్లనే రాబట్టింది.
సాహో దెబ్బతో సుజీత్ తో సినిమా చేసేందుకు ఏ హీరో, నిర్మాత కూడా ముందుకు రావట్లేదు. దీంతో తనకు రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు హీరో శర్వానంద్. శర్వానంద్ తో సుజీత్ మరో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ చిత్రాన్ని రన్ రాజా రన్ ని నిర్మించిన UV క్రియేషన్స్ నిర్మించబోతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.