పాండెమిక్ కారణంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి పథంలో నడవాలని కొన్నాళ్ళు టికెట్ రేట్లను భారీగా పెంచిన నిర్మాతలు, ఆ నిర్ణయం సాధారణ ప్రజలను థియేటర్లకు దూరం చేస్తుందని గమనించి, తిరిగి టికెట్ రేట్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎఫ్ 3, అశోకవనంలో అర్జున కళ్యాణం, విక్రమ్, మేజర్ వంటి సినిమాలు నార్మల్ రేట్లతోనే వచ్చి, సూపర్ హిట్లయ్యాయి. ఈ సినిమాల బాటలోనే థాంక్యూ చిత్రం కూడా లో టికెట్ ప్రైస్ తో థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ చెయ్యగా, నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ లోని మల్టిప్లెక్స్ లలో రూ. 177, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 112 తో స్క్రీనింగ్ కాబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని మల్టిప్లెక్స్ లలో అత్యధికంగా రూ. 177 తో ప్రదర్శితమవబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa