సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అదేంటంటే, SSMB 28లో సెకండ్ హీరోయిన్ రోల్ ఉందని, ఆ ఛాన్స్ కోసం గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమాలంటే, ఇద్దరు హీరోయిన్లు ఉండడం ఖచ్చితమే. కానీ సెకండ్ హీరోయిన్ పాత్రకు సినిమాలో అంతటి ఇంపార్టాన్స్ ఉండదు, ఉన్నా ఆమెకు తరవాత ఎలాంటి ఉపయోగం ఉండకపోవడం ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలో చూస్తూనే ఉన్నాం. కోలీవుడ్ లో వరస సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేస్తున్న ప్రియాంక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించడం, టాలీవుడ్ లో ఆమె ఫ్యూచర్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |