టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అక్కడి ప్రేక్షకులకు బన్నీ డ్యాన్స్, స్టైల్ తెగ నచ్చేస్తుంది. ఇటీవల పాన్ ఇండియా మూవీ పుష్ప తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ తన ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో బన్నీని అడిగారు. దీనికి ఆయన, హిందీలో నటించడమంటే నా కంఫర్ట్ జోన్ ను పక్కన పెట్టినట్లే, అవసరమనిపిస్తే కచ్చితంగా చేస్తానని బదులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa