అలియా భట్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగని రెస్ట్ తీసుకోవడం లేదు. వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో మెరిసింది. ప్రస్తుతం 'డార్లింగ్స్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా స్టైలిష్ లుక్ లో మెరిసింది. మరోసారి తనదైన మార్క్ చూపించింది. జస్మీత్ కె. రీన్ దర్శకత్వంలో డార్లింగ్స్ తెరకెక్కింది. అలియా, విజయ్ వర్మ షెఫాలీ షా, రోషన్ మ్యాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5 నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.