కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ రోజు 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమాల నుండి సర్ప్రైజింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న "సార్" నుండి కూడా సర్ప్రైజ్ వచ్చింది.
ధనుష్ పుట్టినరోజు సందర్భంగా నిన్ననే సార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ రోజు సెకండ్ లుక్ ను రివీల్ చేసారు. ఈ పోస్టర్ లో ధనుష్ సరస్వతి పుత్రుడుగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ రెండు కూడా సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇక, ఈ రోజు సాయంత్రం ఆరింటికి విడుదలయ్యే టీజర్ కోసం ధనుష్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పవర్ఫుల్ విలన్ పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.