కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం "మెగా 154". ఇందులో శృతి హాసన్ కథానాయిక కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 జనవరిలో విడుదల కానుంది.
కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ సవతి సోదరుల్లా నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చెయ్యడం స్టార్ట్ చేసింది.
అదేంటంటే, ఇందులో చిరు ఊరమాస్ దొంగగా, రవితేజ చిరును పట్టుకునే పవర్ఫుల్ కాప్ గా నటించబోతున్నారని వినికిడి. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే మెగా 154 లో జాయిన్ ఐన రవితేజ త్వరలోనే తన పాత్ర షూటింగ్ ను పూర్తి చేసి, తన సినిమాలపై కాన్సెన్ట్రేట్ చెయ్యాలని చూస్తున్నాడట.
![]() |
![]() |