హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం "సీతారామం". వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల కాబోతుంది.
రీసెంట్గానే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యూ సెర్టిఫికెట్ పొంది, చాన్నాళ్ల తర్వాత యూ సెర్టిఫికెట్ పొందిన చిత్రంగా వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సీతారామం నిడివి 2 గంటల 43 నిముషాలు అని తెలుస్తుంది. అంటే దాదాపు మూడు గంటల లవ్ స్టోరీని చూడాలంటే, ప్రేక్షకులు కాస్తంత ఓపిక పట్టాల్సిందే. హను స్క్రీన్ పై అద్భుతమైన మ్యాజిక్ చెయ్యాల్సిందే. ఇప్పటికే ఈ మూవీ పట్ల ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా ఉన్నారు. కానీ, నిడివి ఎక్కువ ఉండడం కాస్తంత నిరుత్సాహం కలిగించే అంశం. సినిమా ఆసక్తికరంగా సాగితే మూడు గంటల సమయం కూడా ఇట్టే గడిచిపోతుంది. RRR విషయంలో ఇది నిజమని ప్రూవ్ అయ్యింది కూడా.