ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ డైరెక్షన్ లో వస్తున్న తిరుచిత్రంబలం మూవీలో రాశీఖన్నా, ప్రియా భవానీ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. తాజాగా ఆడియో ఫంక్షన్ కు ఎల్లో కలర్ సారీలో వచ్చిన రాశీ యూత్ ను అట్రాక్ట్ చేసింది. లేత పసుపు చీరలో తన అందాలు ఆరబోసింది. నెట్టింట్లో ఈ ఫిక్స్ వైరల్ గా మారాయి. హిందీలో "మద్రాస్ కెఫె"తో రాశీ ఖన్నా హీరోయిన్ గా కెరీర్ స్టార్ చేసింది. ఊహలు గుసగు సలాడే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మనం సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. వరుసగా.. 'జిల్' 'జోరు' 'సుప్రీమ్' 'బెంగాల్ టైగర్' 'హైపర్' 'తొలిప్రేమ' 'వరల్డ్ ఫేమస్ లవర్' మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాల్లో అదరగొట్టారు. మరోవైపు వెబ్ సిరీస్లోను అదరగొడుతోంది. ఎప్పుడూ ఇన్ స్టా, ట్వీట్టర్ లలో కొత్త ఫోటోలు పెడుతూ కుర్ర కారును పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శ కత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పాజిటివ్ బజ్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.