తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోందని హీరో నాగచైతన్య అన్నాడు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశామని, అందుకు గల కారణాలు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పాడు. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదంటూ చైతూ ఘాటూగా స్పందించాడు.