వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం "సీతారామం". హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
లేటెస్ట్ గా సీతారామం సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. ఆంధ్రా తెలంగాణాలలో సింగిల్ స్క్రీన్స్ లో రూ. 144, రూ. 150, మల్టీప్లెక్స్ లలో రూ. 177, రూ.195 టికెట్ రేట్లతో విడుదల కాబోతుంది. అదేరోజు విడుదల కాబోతున్న "బింబిసార" కూడా ఇవే రేట్లతో విడుదల కాబోతుంది.