ఇండస్ట్రీలో మెగాస్టార్ తో సినిమా చెయ్యాలని ఆశపడని డైరెక్టర్ లేదా నిర్మాత ఉండరు. చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలిసి డైరెక్టర్లందరూ ఆయన దగ్గరికి క్యూ కట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా చేరిపోయారు.
ఆమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించిన "లాల్ సింగ్ చడ్డా" తెలుగు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తెలుగులో మెగాస్టార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండడంతో, ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా, కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ తనకు మెగాస్టార్ తో ఒక సినిమా తీయాలనుందని, డైరెక్టర్ గా అయినా, నిర్మాతగా అయినా సరే.. ఎలాగోలా ఆయనతో సినిమా తీయాలనుందని చెప్పారు. అందుకు చిరు ఎంతో ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. టేక్ 1 ఒకే అవ్వదు కదా... టేక్ 79 అంటూ ఆమీర్ ను ఆటపట్టించారు. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది.