గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్లపై ఒక క్రేజీ సాంగ్ షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రభుదేవా కొరియోగ్రఫీలో ముంబైలో జరుగుతున్న ఈ పాట యొక్క చిత్రీకరణ పూర్తయినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేశారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో, మలయాళ సూపర్ హిట్ చిత్రం "లూసిఫర్" కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరీజగన్నాధ్, బిజుమీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి కొణిదెల ప్రో కంపెనీ నిర్మిస్తున్నారు.