నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం "కార్తికేయ 2". ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ఈ రోజు ఉదయం 11:07 గంటలకు రివీల్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
కార్తికేయ 2 మొదటి ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.