బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు సోమవారం గన్ లైసెన్స్ మంజూరు చేశారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే మీకూ పడుతుందంటూ కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్ లకు బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేశారు.