బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఆదివారం తన పుట్టినరోజును ప్రియుడు సిద్ధార్డ్ మల్పోతా తో కలిసి స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఒక రోజు ముందుగానే దుబాయ్ వెళ్లిన ఈ జంట.. అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసు కున్నారు. దుబాయ్ లో ఓ అభిమానితో సిద్ధార్, కియారా కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో వారిద్దరు దుబాయ్ వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. తొలిసారి వీరిద్దరు షేర్షా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య బంధం బలపడినట్లు తెలిసింది. త్వరలోనే సిద్ధార్డ్, కియారా పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.